


Pregnancy Journey
26 January 2026 న నవీకరించబడింది
గర్భధారణ సమయంలో ఉండే మూడు వేర్వేరు దశలను 'ట్రైమిస్టరులు లేదా త్రైమాసికాలు' అని అంటారని మనకు తెలుసు. '10వ వారంలో ఉన్న గర్భిణి' అంటే ఎన్ని నెలలు అని మీరు అనుకుంటున్నట్లయితే, 10 వారాల గర్భం అనేది మొదటి త్రైమాసికం పూర్తవ్వడాన్ని సూచిస్తుంది, అంటే, గర్భం యొక్క 3వ నెల పూర్తయింది. రెండవ త్రైమాసికంలో మహిళలు స్త్రీలు చాలా ఎక్కువ ఓపికని కలిగి ఉంటారు అలాగే ఆ మొదట్లో వచ్చిన ప్రెగ్నెన్సీ లక్షణాలన్నీ నెమ్మదిగా తగ్గిపోతాయి.
గర్భం దాల్చాక 10వ వారంలో, పసిబిడ్డలో మరొక వేగవంతమైన పెరుగుదల మార్పు వస్తుంది. ఆపాటికే బిడ్డ మొహం నిష్పత్తిపరంగా ఎక్కువగా గుర్తించవచ్చు కానీ, తల ఇప్పటికీ శరీరం కన్నా చాలా పెద్దగా ఉంటుంది. పాక్షికంగా మూసి ఉన్నప్పటికీ, కళ్ళు ఆ సమయానికే కాంతికి ప్రతిస్పందించగలవు. నోటికి ఈ సమయానికి చిన్న పై పెదవి ఏర్పడుతుంది, ముక్కుకు రెండు చిన్న నాసికా రంధ్రాలు ఏర్పడతాయి అలాగే చెవులు కూడా ఆకృతిని పొందడం ప్రారంభిస్తాయి. దవడ ఎముక కూడా ఎదుగుతోంది ఇంకా పసిబిడ్డకి చిన్న-చిన్న పాల పళ్ళు కూడా ఉంటాయి. గుండె నిమిషానికి 180 సార్లు లేదా సగటు పెద్దవారి గుండె చప్పుడు రేటు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ కొట్టుకుంటుంది. పుట్టబోయే పిండం ఈ సమయానికి తల నుండి అడుగు వరకూ 30 మిమీ పొడవులో లేదా చిన్న ఆప్రికాట్ పండు పరిమాణంలో ఉంటుంది. స్కాన్‌లలో చూడగలిగే విధంగా పసిబిడ్డ కుదుపులకి గురైనట్లు కదులుతూ ఉంటుంది.
ఒక మహిళ 10 వారాల గర్భవతిగా అంటే 3వ నెలలో ఉన్న సమయంలో గుర్తించదగిన మొదటి విషయాలలో ఒకటి, వారి పొత్తికడుపు కొద్దిగా గుండ్రంగా మారుతుంది. ఈ సమయంలో, తృణధాన్యాలు, పండ్లు మరియు కూరగాయల రూపంలో పీచుపదార్థం సహాయపడుతుంది, చాలా నీళ్ళు త్రాగడం అలాగే తరచుగా ఒంటిని కదిలించడం కూడా ఇలా సహాయపడే విషయాలే అవుతాయి. ఎందుకంటే విస్తరిస్తూ ఉన్న గర్భాశయం ఆ సమయంలో దబ్బపండు పరిమాణంలో ఉంటుంది. ఏ గర్భవతి మహిళ అయినా 10వ వారం ప్రెగ్నెన్సీలో ఉండి, ఆమె కడుపు భాగం (బంప్) కొద్దిగా పెరిగినట్లు కన్పించకపోతే, పర్వాలేదు, తొందరలోనే కనిపిస్తుంది. అలాగే ఆమె తన స్తనాలు ఇంకా పొట్ట యొక్క చర్మంపై హఠాత్తుగా నీలి చారలు ఏర్పడటం కూడా గమనించవచ్చు.
హార్మోన్ చర్యల కారణంగా, గర్భవతిగా ఉన్న మహిళలకి కడుపు ఉబ్బరం, అపానవాయువు లేదా త్రేపులు వస్తాయి. ఈ సమయంలో, స్త్రీ హార్మోన్ అయిన ప్రొజెస్టెరాన్, గర్భాశయం యొక్క కండరాలను వదులుచేసి ఎదుగుతున్న బిడ్డతోపాటు కలిసి విస్తరిస్తూ దాని పని చేస్తుంది. ఈ ప్రక్రియలో జీర్ణవ్యవస్థలోని కండరాలు కూడా వదులవుతాయి, అది గుండెల్లో మంట వంటి లక్షణాలను కలిగిస్తాయి.
మలబద్ధకం మొదటి ట్రైమిస్టరు యొక్క ప్రెగ్నెన్సీ లక్షణం, ఇది సర్వ సాధారణమైనది. ఈ దశని తక్కువ ఇబ్బందితో గడపటానికి కొన్ని దశలు ఉన్నాయి. ముందుగా, జీర్ణవ్యవస్థకి అవరోధంగా నిలిచే రిఫైన్ చేసిన వైట్ బ్రెడ్, కొన్నిరకాల ధాన్యాలు ఇంకా పాస్తా వంటి ఆహారపదార్థాలకి దూరంగా ఉండండి. తరువాత, పీచు పదార్థాలపై దృష్టి పెట్టండి: మలబద్ధకం ఉన్నవారికి మంచి స్నేహితులైన కివీ వంటి తాజా పండ్లను అలాగే పీచుపదార్థాలు అధికంగా ఉండే సంపూర్ణ ధాన్యాల వంటి వాటిని ఎంచుకోండి.
ఈస్ట్రోజెన్ ఉత్పత్తి పెరగడం వలన అలాగే యోనికి రక్త ప్రసరణ పెరగటం కారణంగా ల్యుకోరియా అనే పారదర్శకమైన, వాసన లేని డిశ్చార్జి ఎక్కువగా జరగవచ్చు. ఇది కొద్దిగా ఎబ్బెట్టుగా ఇబ్బందికరంగా అన్పించినా, ఇది ప్రకృతి కేవలం సూక్ష్మజీవులను తొలగిస్తున్నట్టుగా ఉంటుంది. కానీ అది రంగులో ఉండి, రక్తం వస్తూ ఉంటే, దుర్వాసన లేదా అసౌకర్యంగా ఉంటే, డాక్టర్ని సంప్రదించాలి.
గర్భాశయం చుట్టూ ఉన్న వృత్తాకార లిగమెంట్లు సాగినట్లు అయినప్పుడల్లా కడుపునొప్పి వస్తూ ఉంటుంది. ఈ నొప్పి వలన అపాయం ఏమీ ఉండదు కానీ అది తీవ్రంగా లేదా సన్నగా వస్తూ ఉంటుంది. గర్భం యొక్క 10వ వారం సమయంలో, స్తనాల పరిమాణం పెరుగుతుంది, లిగమెంట్లు ఇంకా కండరాలు కూడా పొత్తికడుపు లోపల విస్తరించడం ప్రారంభిస్తాయి అలాగే కొన్ని ఇతర తీవ్రమైన మార్పులు కూడా జరగవచ్చు. మహిళలు తమకి కావల్సినంత సమయం తీసుకుని నెమ్మదిగా లేవటం, సున్నితంగా కదలటం వంటివి చేయాలి. అప్పుడు ఈ నొప్పి తరచుగా రావటం తగ్గవచ్చు.
ఎదుగుతున్న బిడ్డకి చోటు కోసం మీ పొట్ట భాగం విస్తరిస్తున్నప్పుడు కొన్ని నొప్పులు అనుభవించటం సాధారణమే. కొంతమంది తల్లి కాబోతున్న మహిళలకి ‘గుండ్రటి లిగమెంట్ నొప్పి’ తెలీకుండానే వచ్చి వెళ్లిపోతుంది లేదా పూర్తిగా అది ఆ నొప్పే అని అర్థం చేసుకోలేకపోవచ్చు. అదే మరికొంతమందికి చాలా బాధాకరమైన నొప్పి అవుతుంది. ఒక మహిళ కవల పిల్లలతో గర్భం దాల్చినట్లయితే 10వ వారంలో ఈ నొప్పి స్పష్టంగా తెలుస్తుంది.
గర్భం దాల్చిన సమయంలో 10వ వారానికి వచ్చేసరికి, స్త్రీ యొక్క స్తనాల పరిమాణం పెరుగుతుంది అలాగే వచ్చే వారాల్లో తల్లిపాలు ఇవ్వడానికి తయారీగా కొంచెం నొప్పిగా కూడా మారతాయి.
ఎవరైనా స్త్రీ 10 వారాల గర్భంతో ఉన్నప్పుడు, వికారం, వాంతులు అనేవి సహజం కానీ అవి ఎల్లప్పుడూ పొద్దున్నే రావు. అలాగే రెండవ ట్రైమిస్టరు మొదలవగానే నెమ్మదిగా తగ్గిపోవాలి కూడా.
శరీరంపై కన్పించే నీలం చారలు ఎదుగుతున్న బిడ్డకి అండగా శరీరం ఉత్పత్తి చేస్తున్న అదనపు రక్తం అని ప్రధానంగా గుర్తుంచుకోండి. ఈ సమయంలో సిరలలో ఎక్కువ మొత్తంలో రక్తం ప్రవహిస్తున్నందున, చర్మంపై సాలీడు ఆకృతిలో కూడా రక్తనాళాలు కన్పించవచ్చు.
10 వారాల గర్భం అంటే 3 నెలలు అవుతుంది. 10వ వారం వచ్చేసరికి, మీ బిడ్డ ఫలదీకరణం చెందిన అండం దశ నుండి పిండం దశకి వెళ్తుంది. ఈ రెండు పదాలు కూడా బిడ్డ ఎదుగుదలలో వచ్చే అనేక దశలని వివరిస్తాయి. ప్రధాన అవయవాలైన మెదడు, గుండె, ఊపిరితిత్తులు, అలాగే ఇంకా చేతులు, కాళ్ళు ఈ పిండ దశలో ఏర్పడతాయి. ఈ అవయవాలు తర్వాత కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. గర్భంలో 10వ వారం వచ్చేసరికి బిడ్డ యొక్క చేతుల కీళ్ళు పనిచేస్తాయి ఇంకా మృదులాస్థి, ఎముకలు కూడా ఎదుగుతూ ఉంటాయి. ఈ సమయంలో గర్భవతిగా మీరు రెండవ ట్రైమిస్టరులోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉంటారు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: 10-వారాల ప్రెగ్నెన్సీ పొట్ట పరిమాణం: ఏది సాధారణం? ఏది కాదు?
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips


పసిపిల్లలకు చలికాలపు దుస్తులు కొనేటప్పుడు ఎలాంటి బట్టలను పరిగణనలోకి తీసుకోవాలి?

మీరు మీ బిడ్డకు ఆవు పాలను ఎప్పుడు ఇవ్వవచ్చు? (When Can You Give Cow's Milk to Your Baby in Telugu?)

ఎల్ఎంపీ, అల్ట్రాసౌండ్ స్కాన్ మధ్య తేడాలు

గర్భధారణ సమయంలో ఎకోస్ప్రిన్-150 తీసుకోవడం సురక్షితమేనా? (Is It Safe To Take Ecosprin 150 In Pregnancy in Telugu?)

బేబీ బట్టలు ఉతికేటప్పుడు మీరు తప్పక పాటించాల్సినవి & చేయకూడనివి! (Do’s & Don’ts You Must Follow While Washing Baby Clothes in Telugu)

మల్టీపుల్ బర్త్(ఒకరి కంటే ఎక్కువ మంది జననం): కవలలు, ముగ్గురు పిల్లలు పుట్టినపుడు ఉండే ప్రమాదాలు & లక్షణాలు

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |